అక్రమ ఇసుక రవాణాకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం మంథని మండలం వెంకటాపూర్, అడవి సోమనపల్లి గ్రామాలలోని ఇసుక రీచ్ లను, మంథని పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమాన్ నాయక్, తహసిల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి ఉన్నారు.