స్నేహితుడి కుటుంబానికి చేయూత

76చూసినవారు
స్నేహితుడి కుటుంబానికి చేయూత
పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దాసరి శివాజీ ఏడాది క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందగా అతని కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు చేయూతనిచ్చారు. శివాజీ 10వ తరగతి చదువుకున్న నాటి తోటి విద్యార్థులు (అప్పన్నపేట) రూ. 20వేలు, (బ్రాహ్మణపల్లి) రూ. 25వేలు జమ చేశారు. రూ. 45వేలను శివాజీ కూతురు పేరిట పిక్స్డ్ డిపాజిట్ చేసి బుధవారం కుటుంబ సభ్యులకు అందించారు. అప్పన్నపేట, బ్రాహ్మణపల్లి మిత్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్