జిల్లా జనరల్ ఆసుపత్రిలోని ఓపి కాంప్లెక్స్, డయాలసిస్ యూనిట్లను ఎంసీహెచ్ లోకి తరలించేందుకు ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలోని ఎంసీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. పెద్దపల్లిలో రూ. 57 కోట్లతో నూతన ఆసుపత్రి భవనం నిర్మించేందుకు గాను పాతబడిన ఆసుపత్రి కూల్చి వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.