కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన వాయుపుత్ర ఆటో యూనియన్ మండల అధ్యక్షునిగా బండారి కొమురయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో యూనియన్ సభ్యుల సమావేశంలో
ఎన్నికలు నిర్వహించగా, ఉపాధ్యక్షుడిగా అల్లంల పోషాలు, కోశాధికారిగా చిలుముల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆటో డ్రైవర్ల సమస్యలను తమ వంతుగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అల్లం శంకర్, రఫీ, జనగామ నాగరాజు పాల్గొన్నారు.