పెద్దపల్లి: రోగులకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

55చూసినవారు
పెద్దపల్లి: రోగులకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్
వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి లోకి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని, రంగంపల్లి లోని మైనారిటీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లోని ఆయుష్మాన్ భారత్ ఓపి రిజిస్ట్రేషన్, నూతనంగా నిర్మించే ఆసుపత్రి భవనం, కూల్చివేతకు సిద్ధంగా ఉన్న మూడు వార్డులను, డయాలసిస్ జరుగుతున్న మిషనరీలను, స్కానింగ్ ఓపి గదులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్