పెద్దపల్లి: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు: ఏసీపీ కృష్ణ

నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి ఏసీపి గజ్జి కృష్ణ అన్నారు. మంగళవారం ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనగర్తి గ్రామంలో ప్రజల సహకారంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏసీపీ గజ్జి కృష్ణ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ దీకొండ రమేష్, గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు.