రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచుకోవడం ద్వారా అధిక లాభం కలుగుతుందని పశువైద్యాధికారి డాక్టర్ మల్లేశం అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సూపర్‌వైజర్ రాఘవ ఆధ్వర్యంలో ఓదెల మండలం పిట్టల ఎలయ్యపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం, కృతిమ గర్భధారణ ద్వారా జన్మించిన దూడల ప్రదర్శన నిర్వహించి నట్టల నివారణ మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర మహేష్, ఓదెలు, ప్రవీణ్ పాల్గొన్నారు.