ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం పెద్దపల్లి మాతా శిశు కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఏఎన్ సి రిజిస్ట్రేషన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలు, 102 సర్వీస్ సేవలపై అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వైద్యాధికారులు ఉన్నారు.