పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గల డిస్నీలాండ్ వింటర్ ఉత్సవ ఎగ్జిబిషన్ జిల్లా ప్రజలను మరియు చిన్నారులను ఎంతగానో అలరిస్తుంది. జిల్లా ప్రజలు సాయంకాలం వేళలో ఎగ్జిబిషన్ కు వచ్చి సేద తీరుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో చిన్నారులను అలరించే సింగపూర్ ఎయిర్ లైన్స్, మినీ కాశ్మీర్ మరియు లండన్, దుబాయ్ సిటీ ఇలా చాలా అద్భుతమైన దృశ్యాలు చూసి చిన్నారులు కేరింతలు కొడుతున్నారు.