పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శ్రీరాంపూర్ పాఠశాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాల్క కొమురయ్య గురువారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారిచే విద్యార్థులందరికీ ఉచిత ఏకరూప దుస్తులు మరియు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయించడం జరిగింది. అలాగే పాఠశాల ఆవరణలో ఒక మొక్క నాటించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీని పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించడం జరిగింది.