పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గీత కార్మిక సంఘాల ధర్నా

77చూసినవారు
పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గీత కార్మిక సంఘాల ధర్నా
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు గౌడ, గీత కార్మిక సంఘాల నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. ఎన్టీపీసీ యాజమాన్యం సోలార్ పవర్ ప్లాంట్ కోసం ఈత, తాటి వనాలను కూల్చి గీత కార్మికుల పొట్ట కొడుతుందని వాపోయారు. ఈత, తాటి చెట్లను కూల్చినా అధికారులు పట్టించుకోవడం లేదని, గీత కార్మికులకు న్యాయం జరిగే వరకు అన్ని గౌడ సంఘాలను ఏకం చేసి ఉద్యమిస్తామని మోకు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అంజిగౌడ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్