ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీర్ జాకీర్ అలీ జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద గౌసేపాక్ షీల్లా షరీఫ్ దగ్గర నిర్వహించారు. గురువారం జాకీర్ అలీని ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షేక్ హాజీ అలీ పూలమాల, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ షేక్ హుస్సేన్ బాజీ, జాయింట్ సెక్రటరీ హసన్, తదితరులు పాల్గొన్నారు.