ప్రజలకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో గ్రామపంచాయతీల పని తీరుపై అధికారులతో సమీక్ష జరిపారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ఉపాధి పనులు, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డ్, పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఈ సమావేశంలో డీపీఓ వీర బుచ్చయ్య, జడ్పి సీఈఓ నరేందర్, డీఆర్డీఓ రవీందర్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.