పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సదయ్య, ధర్మకర్తలు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, ఆరెల్లి మొండయ్య గౌడ్, కనికిరెడ్డి సతీష్, రాపర్తి మల్లేష్ గౌడ్, మూడేత్తుల శ్రీనివాస్, కర్రే కుమారస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.