ప్రయగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు బుధవారం జూలపల్లికి చెందిన యువకులు పవిత్ర స్నానానికి వెళ్ళారు. ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మికమైన మహా కుంభమేళా గత నెల 13న పుష్య పౌర్ణమి నాడు ప్రారంభమై ఈ నెల 26 న మహాశివరాత్రి పర్వదినం వరకు ఈ ఉత్సవం కొనసాగుతోంది. ఈ యాత్రలో సామజిక కార్యకర్త గంగిపల్లి విద్యాసాగర్, మేర శ్రీనివాస్, రాకేష్, అజయ్, సంతోష్, జితేందర్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.