కమాన్పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వరాహ స్వామి గర్భాలయం చుట్టు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు ముడుపులు కట్టి కోర్కెలు కోరుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు.