కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మల్యాల మోడల్ స్కూల్ వరకు పాఠశాల పని దినాల్లో బస్సు రాకపోకలు సాగుతాయి. గ్రామానికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాల వరకు ప్రజలు వెళ్లి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి పెద్దపల్లి-జమ్మికుంట వయా మల్యాల మీదుగా ఉదయం, సాయంత్రం బస్సును నడపాలని ప్రయాణికులు ఆదివారం కోరుతున్నారు.