వేసవి దృష్ట్యా పెట్టుకొని అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్ కో పెద్దపల్లి డీఈ తిరుపతి తెలిపారు. శుక్రవారం సుల్తానాబాద్ పట్టణం పూసాల మెయిన్ రోడ్ లో లో-ఓల్టేజీ సమస్య లేకుండా ముందస్తుగా గుర్తించే ప్రణాళికలలో భాగంగా 160 కెవి ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు రాకుండా నూతన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.