సుల్తానాబాద్: పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే

50చూసినవారు
సుల్తానాబాద్: పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన అంజమ్మ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరింది. పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు సహకారంతో అంజమ్మ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిధి నుండి రూ. 1. 50లక్షల రూపాయల ఎల్ ఓ సీ మంజూరైంది. శుక్రవారం ఎల్ ఓ సీ చెక్కును ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్