ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరు నది ఒడ్డున ఉన్న శ్రీరామ భద్ర ఆలయాన్ని వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాకతీయ కాలం నాటి దేవాలయం అని సిరిసిల్ల రాజయ్యకు ఆలయ అర్చకులు వివరించారు. ప్రభుత్వం చొరవ చూపి ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచాలని అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.