ఈనెల 20న పెద్దపల్లిలో ఎంబి గార్డెన్ లో జరిగే బీసీ సదస్సుకు తరలి రావాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ కోరారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం సదస్సు కరపత్రాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఉన్న యాదవులు, యాదవ యువత పెద్ద సంఖ్యలో బీసీ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.