వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని బుధవారం ఒక ప్రకటనలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేనియెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.