సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులకు ఆర్-1 లోని జీవీటీసీలో గురువారం ఇంటర్వ్యూ నిర్వచించారు. జీఎం లలిత్ కుమార్ పాల్గొన్నారు. 118 మంది దరఖాస్తు చేసుకోగా 85 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 16 నుంచి హైదరాబాదులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని జీఎం తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొ న్నారు.