పెద్దపల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

76చూసినవారు
పెద్దపల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి సిరిమల్లె మహేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సునీత విచ్చేసి, సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాలంకరణ చేసి కొబ్బరికాయలు కొట్టి పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులతో అక్షరాభ్యాసం కార్యక్రమం చేయించారు.

సంబంధిత పోస్ట్