ఈసీ క్లియరెన్స్, ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా స్టోన్ మెటల్ క్వారీలు నిర్వహిస్తున్నారని లైసెన్స్ డ్ క్వారీ యజమాని సంపంగి లక్ష్మణ్ ఆదివారం ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, సుమారు 14 స్టోన్ మెటల్ క్వారీలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈసీ క్లియరెన్స్ లేదని, అక్రమంగా బ్లాస్టింగ్స్ నిర్వహిస్తూ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న యజమానుల పై జిల్లా మైనింగ్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.