రాబోయే వానాకాలం నాటికి ఆర్ఓబీ సిద్ధం: కలెక్టర్

51చూసినవారు
రాబోయే వానాకాలం నాటికి ఆర్ఓబీ సిద్ధం: కలెక్టర్
రాబోయే వానాకాలం నాటికి పెద్దపల్లి- కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే విజయ రమణరావుతో కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆర్ఓబీ నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య, ఈఈ ఆర్&బీ భావ్ సింగ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్