అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మండలం కాపులపల్లి నుండి గోపయ్యపల్లి వరకు రూ. 1కోటితో, సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లి నుండి సాంబయ్య పల్లి వరకు రూ. 1కోటితో నిర్మించే బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, నాయకులు పాల్గొన్నారు.