రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు: సీపీ

71చూసినవారు
రామగుండం: బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు: సీపీ
పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని కమిషనర్ ఎం. శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞలు 01-01-2025 నుండి 01-02-2025 వరకు కొనసాగుతాయని తెలిపారు. అలాగే డీజేల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు కూడా పొడగించామని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్