పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కుంబాల సుధాకర్, పుల్లూరు సంధ్యారాణి, రాజ్ కుమార్, జేఏసీ జిల్లా అధ్యక్షులు తిరుపతి, తాళ్లపల్లి మల్లయ్య, రవిరాజ్, జిల్లా మెసెంజర్ సంఘం అధ్యక్షులు మామిడాల సంపత్ పాల్గొన్నారు.