పెద్దపల్లి మండల తహశీల్దార్ గా రాజయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ నిర్వహించిన బదిలీల్లో భాగంగా పెద్దపల్లిలో తహశీల్దార్ గా విధులు నిర్వహించిన రాజ్ కుమార్ మంథనికి బదిలీ కాగా, మంథనిలో విధులు నిర్వహిస్తున్న రాజయ్యను పెద్దపల్లికి బదిలీ చేశారు. ఈ సందర్బంగా తహశీల్దార్ రాజయ్య బుధవారం విధుల్లో చేరగా.. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.