పెద్దపల్లి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన న్యాయవాది ఉప్పు రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. జూనియర్ సివిల్ జడ్జ్ మంజుల చేతుల మీదుగా తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. తనపై పెట్టిన బాధ్యతలను క్రమశిక్షణగా నిర్వహిస్తానని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.