ఆధునిక డిజైన్లలో బట్టలను కుట్టేందుకు నైపుణ్యాభివృద్ధి కోసం మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లను కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.