ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్ పాల్గొన్నారు.