పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో సవారి కచ్చరం ప్రత్యేక ఆకర్షణంగా మారింది. కలెక్టరేట్ సముదాయాన్ని సందర్శించే ప్రజల కోసం ఈ సవారి కచ్చరాన్ని ఏర్పాటు చేశారు. ఈ తరం యువత కోసం అలనాటి ఎద్దుల బండి కచ్చురాలను పొందుపరుస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో వాటి ప్రత్యేకతలను వివరిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. రైతులకు ప్రాధాన్యత ఇస్తూ పూర్వకాలపు వస్తువులను పొందుపరస్తు మ్యూజియం ఏర్పాటు చేయడం విశేషం.