
అగ్ని ప్రమాదం.. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ
TG: చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. వారి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ. 2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. కాగా 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ ఘటనపై ఆరా తీశారు.