సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్టేడియంలో రేపు జరగనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాదుకు చెందిన 80 కంపెనీల ప్రతినిధులు పాల్గొని సుమారు 3000 మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ సందర్భంగా వేదిక స్టాల్స్, భారీ గేట్లు, టెంట్లు, భోజనం నీటి సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.