గోదావరిఖనిలో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలు శుక్రవారం మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిలక్ నగర్ లోని సింగరేణి కార్మికుడి కుటుంబం వీణ రమేష్ నివాసంలో అష్టలక్ష్మి అలంకరణలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, మంగళ హారతులతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వివిధ రకాలైన తీపి పదార్థాలు, పరమాన్నం నైవేద్యంగా సమర్పించారు.