సింగరేణి సంస్థలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రవేశపెట్టే ఈ-ఆఫీస్ విధానంలో భాగంగా సంస్థలోని వివిధ విభాగాల కార్యాలయాలలో కాగిత రహిత కార్యకలాపాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం జీఎం కార్యాలయంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. రామగుండం- 3 జీఎం సుధాకరరావు మాట్లాడుతూ సులభతర కార్యాలయ విధానం అమలులో భాగంగా కాగిత రహిత సేవలు భద్రతతో నిర్వహణ, సకాలంలో అధికారుల ఆమోదం పొందేలా ఈ-ఆఫీస్ విధానాన్ని రూపొందించారన్నారు.