గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో చైనా మాంజపై నిషేధం విధించామని ఏసీపీ రమేశ్ తెలిపారు. శుక్రవారం ఖనిలో మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా చైనా మాంజ విక్రయించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత చైనా మంజా వ్యర్ధాల వల్ల పక్షులతోపాటు మనుషులకు హాని కలుగుతోందన్నారు. ఈ మాంజ అమ్మినా, నిల్వ, రవాణా చేసినా ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని హెచ్చరించారు.