బాధిత మహిళల రక్షణకు భరోసా కేంద్రాలు: రామగుండం సీపీ

80చూసినవారు
బాధిత మహిళల రక్షణకు భరోసా కేంద్రాలు: రామగుండం సీపీ
బాధిత మహిళల రక్షణ కోసమే భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. గురువారం పెద్దపల్లి జోన్ లో బాధిత మహిళలు, బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, అన్నిరకాల సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి ఏడాదవుతున్న సందర్బంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. సీపీ బాధితులతో మాట్లాడి ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్