గోదావరిఖని: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

59చూసినవారు
గోదావరిఖని: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. రోగులకు మరిన్ని సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఆధునీకరణ పనులను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు సింగ్, డాక్టర్ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్