పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి చెందిన సుజాతకు కరీంనగర్ భద్రకాళి హాస్పటల్ లో స్పైన్ సర్జరీ జరిగి రక్తం తక్కువ ఉండగా అరుదైన ఓ నెగటివ్ రక్తం అవసరం ఏర్పడింది. వెంటనే వైకే ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు అరిగేల వెంకటేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయి కిషోర్ గౌడ్ కి సమాచారం ఇచ్చారు. స్పందించిన సాయికిషోర్ కరీంనగర్ లోని మైత్రి బ్లడ్ బ్యాంక్ లో 30వ సారి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు.