
శిలాఫలకం ధ్వంసం.. వైసీపీ మాజీ ఎంపీపీ జగన్మోహన్ అరెస్ట్
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గాండ్లపెంట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ చేయగా, వైసీపీ నేతలే ధ్వంసం చేశారనే నిర్ధారణ అయింది. ఈ క్రమంలో మాజీ ఎంపీపీ, వైసీపీ నేత జగన్మోహన్తో పాటు మరికొందరు ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఫేక్ కేసు నమోదు చేశారంటూ ఆరోపిస్తూ.. పీఎస్ వద్ద వైసీపీ నేతలు హల్చల్ చేశారు.