
నియోజకవర్గానికో ఆదర్శ పాఠశాల.. లోకేశ్ వెల్లడి
AP: ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఆదర్శ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం, ఏఐ వర్సిటీ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు.