18న రామగుండం రీజియన్ లో మెగా జాబ్ మేళా

68చూసినవారు
18న రామగుండం రీజియన్ లో మెగా జాబ్ మేళా
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ద్యేయంగా ఈనెల 18న రామగుండం రీజియన్ లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని అర్జీ వన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. అర్జీ వన్ జియం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ జాబ్ మేళాకు హైదరాబాద్ నోబుల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సొసైటీ సౌజన్యంతో 100 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 25 రంగాలలో 3 నుండి 4 వేల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాకు 7వ తరగతి నుండి పోస్ట్. గ్రాడ్యుయేట్ వరకు విద్యార్హతగా, 18 నుండి 30 సంవత్చరాల లోపు వయో పరిమితినీ నిర్ణయించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్