ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జనవరి 1నుండి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ -11ను విజయవంతం చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. గురువారం రామగుండం కమిషనరేట్లో సీపీ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ స్మైల్ లో భాగమయ్యే ప్రతీ అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏసీపీ మల్లారెడ్డి పాల్గొన్నారు.