పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ పరిధి కమిషనరేట్ ఆర్మ్డ్ విభాగంలో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్లకు హెడ్ కానిస్టేబుల్లుగా, హెడ్ కానిస్టేబుల్లకు ఏఆర్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా సీపీ కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితోపాటు బాధ్యత పెరుగుతుందన్నారు.