రామగుండం: రక్తదానం చేసిన వారిని అభినందించిన అదనపు కలెక్టర్ అరుణశ్రీ

84చూసినవారు
రామగుండం: రక్తదానం చేసిన వారిని అభినందించిన అదనపు కలెక్టర్ అరుణశ్రీ
100 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 30 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు ఉన్నారు. రక్తదానం చేసిన వారికి అదనపు కలెక్టర్ అభినందించడంతో పాటు ప్రశంస పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్