రామగుండం: అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన బీజేపీ నాయకులు

50చూసినవారు
రామగుండం: అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన బీజేపీ నాయకులు
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా రామగుండం మండలం గోదావరిఖని జియం కాలనీలో రామగుండం మండల ఇన్చార్జి కందుల సంధ్యారాణి అంగన్వాడి సెంటర్ ను శుక్రవారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల పోషణ మరియు శిశు సంరక్షణకు అంగన్వాడి కేంద్రాలు కీలకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షుడు గుండబోయిన భూమయ్య, బండారి శ్యామ్, విశ్వస్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్