రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన తొలి తరం జర్నలిస్ట్ కె. పి రామస్వామి 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గల రామగుండం నగరపాలక సంస్థ మెప్మా విభాగానికి చెందిన ప్రగతి ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహణలో రామస్వామి కుమారుడు కె. పి శ్రీనివాస్ 15 మందికి బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. అలాగే అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.